Thursday, April 25, 2024

Breaking: బండి సంజయ్ ని కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కాసేపట్లో రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా దీక్ష చేపట్టి, పోలీసుల విధులను అడ్డుకున్నారని బండితో పాటు బీజేపీ నాయకులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కరీంనగర్ పిటిసిలో వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్ ని కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.

కాగా, ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement