Wednesday, May 1, 2024

టీఆర్ఎస్ ధర్నాకు రైట్.. రైట్.. షర్మిల దీక్షకు బ్రేక్

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ధాన్యం కొనుగుళ్ల విషయంలో బీజేపీ,టీఆర్ఎస్ నాయకులు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కేంద్ర నిర్ణయం వల్లే ధాన్యం కొనుగుళ్ల సాధ్యం కావడం లేదని టీఆర్ఎస్.. బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో ధాన్యం సేకరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనుంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గరకు కూడా ధర్నా తలపెట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు కొన్ని షరతులత కూడిన అనుమతి ఇచ్చారు.

అయితే, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తలపెట్టిన కార్యక్రమానికి మాత్రం నో చెప్పారు. వైఎస్ షర్మిల తలపెట్టిన 72 గంటల రైతు వేదన దీక్షకు ఇందిరాపార్క్ వద్ద అనుమతి నిరాకరించారు. శుక్రవారం ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్‌ ఆందోళన కారణంగా.. వైఎస్‌ షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వలేదు సెంట్రల్‌ జోన్‌ పోలీసులు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో 72 గంటల దీక్ష చేపట్టనున్నారు.

కాగా, రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటలపాటు దీక్ష చేయనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు దీక్ష చేయాలనుకున్నారు. ఇందిరాపార్క్ వేదికగా తలపెట్టిన షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఇది కూడా చదవండి: idol of Annapurna: వందేళ్ల తర్వాత యూపీ చేరిన అన్నపూర్ణ దేవి విగ్రహం!

Advertisement

తాజా వార్తలు

Advertisement