Saturday, May 4, 2024

బైక్ పై స్టంట్స్ – ముగ్గురి అరెస్ట్

పోలీసులు ఎంత‌గా చెబుతున్నా బైక్ స్టంట్ లు ఆప‌డంలేదు. కాగా ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలోని నోయిడా రోడ్ల‌పై వికాస్ అనే యువకుడు శక్తిమాన్‌ తరహాలో బైక్‌పై స్టంట్లు చేశాడు. ఆ స్టంట్ల‌ని మరో ఇద్దరు యువకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గా మారి.. పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇంకేముంది.. న్యూసెన్స్‌ కేసు బుక్‌చేసి బైక్‌ నడిపినందుకు వికాస్‌ను, ఆ ఫీట్‌ను వీడియోసినందుకు అతని స్నేహితులను అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై స్టంట్లు చేసిన ముగ్గురు జైలుపాలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement