Saturday, May 18, 2024

సీఎంలతో మోడీ సమావేశం.. కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనే శుక్రవారం కరోనా ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్షరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మధ్యాహ్నం అం 12.30 గంటలకు ఆక్సిజన్ కొరత తోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని కూడ రద్దు చేసుకున్నారు.

ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయా రాష్ట్రాలు ఎదుర్కోంటున్న సమస్యలను చర్చించడంతో పాటు ప్రధాని పలు కీలక సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ పలు సార్లు సమావేశం నిర్వహించి కరోనా పరిస్థితి చర్చించారు. అయితే ఇప్పుడు కేసులు సంఖ్య మూడు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై ఏమైనా ప్రకటన చేస్తారా? అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గత సంవత్సరం కోవిడ్ సమయంలో కూడ ప్రధాని మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యారు. అనంతరం లాక్‌ డౌన్‌ తో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అయితే ఇప్పటికే లాక్ డౌన్ పై ఆయా రాష్ట్రాల తమ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో లాక్ డౌన్ పై రాష్ట్రాల సీఎంలతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో కరోనా టీకాలతోపాటు ఆక్సిజన్ ల కొరత రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని చర్చించనున్నారు.

రెండు రోజుల క్రితం జాతినుద్దేశించి చేసిన కీలక ప్రసంగంలో లాక్ డౌన్ పై అపోహలు,భయాలు వదిలిపెట్టాలని ప్రధాని మోదీ అన్నారు. లాక్ డౌన్ ను రాష్ట్రాలు.. చివరి అస్త్రంగానే ప్రయోగించాలని..మైక్రో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తుఫానులా వచ్చి పడిందని భారత్ మరో అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటోందని మోడీ అన్నారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కాగా, దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చింది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 3,14,835 మందికి కరోనా నిర్ధారణ కాగా.. 2,104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మహారాష్ట్ర, అంధప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. అంతే కాదు మరణాల సంఖ్య కూడా ఆయా రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలో నిర్వహించే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement