Sunday, April 28, 2024

Petrol, Diesel Prices: నాన్ స్టాప్ గా పెట్రో బాదుడు.. 10 రోజుల్లో 9 సార్లు పెంపు

దేశవ్యాప్తంగా పెట్రో మంట కొనసాగుతోంది. ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ చమరు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు రూ.115.4కు ఎగసింది. డీజిల్ ధర రూ.101.56కు చేరింది. ఇక ఏపీలో అయితే పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 83 పైసలు చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.117.32కు, డీజిల్ ధర రూ.103.1కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్​, డీజిల్​ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్​ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజుల్లో 9 రోజులు పెరుగుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement