Friday, May 17, 2024

Petrol, Diesel Prices: పెట్రో బాదుడు తగ్గేదే లే.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు కొనసాగుతోంది.  ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్‌ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు ఈ రోజు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసల చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో దేశ ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్‌ రూ.97.23కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.112.51, డీజిల్‌ రూ.96.70గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్‌ రూ.112.51, డీజిల్‌ రూ.96.70గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ రూ.103.67, డీజిల్‌ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.106.34, డీజిల్‌ రూ.91.42 పెరిగింది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement