Thursday, April 25, 2024

మేలో 12వ సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మే నెలలో ఇప్పటి వరకు 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది. ఇంతకు ముందు శుక్రవారం ధరలు పెరగ్గా.. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్‌పై లీటర్‌కు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో దాదాపు వందకు చేరువైంది. లీటర్‌ పెట్రోల్‌ రూ.99.49, డీజిల్‌ రూ.91.30కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.94.86 డీజిల్‌ రూ.88.87, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.27, డీజిల్‌ రూ.86.91, హైదరాబాద్‌లో రూ.96.88, డీజిల్‌ రూ.91.65, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.68, డీజిల్‌ రూ.92.78కు చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement