Sunday, April 28, 2024

GOOD NEWS: వాహనదారులకు ఊరట.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

వాహనదారులకు చమరు సంస్థలు స్వల్ప ఊరటనిచ్చాయి. వరుసగా ప్రతిరోజు ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఈ రోజు మాత్రం స్థిరంగా కొనసాగించాయి. ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా.. డీజిల్ ధర రూ. 105.49 గా కొనసాగుతుంది. ఇక, ఏపీలోని విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 120.81 ఉండగా.. డీజిల్ ధర రూ. 106.40గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.44 ఉండగా.. డీజిల్ ధర రూ. 107.04 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.  

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ రూ. 105.41 ఉండగా.. డీజిల్ రూ. 96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120.51.. డీజిల్ రూ. 104.77 వద్ద ఉన్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 110.95.. డీజిల్ ధర రూ. 101.04 గా ఉంది. కోల్ కతా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.12.. డీజిల్ రూ. 99.83 స్థిరంగా కొనసాగుతుంది. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసందే. గడిచిన 17 రోజులుగా 3 రోజులు మాత్రమే ఇంధన ధరలు పెరగలేదు. మొత్తం ఇప్పటివరకు పెట్రోల్ ధర దాదాపు రూ. 10 పైగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement