Monday, July 15, 2024

Breaking: బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌పై హైకోర్టులో పిటిష‌న్‌

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి ముగ్గురు బీజేపీ సభ్యుల సస్పెన్స్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన తొలి రోజు.. నిమిషాల వ్య‌వ‌ధిలోనే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల‌ను ఏకంగా బ‌డ్జెట్ సమావేశాల సాంతం వ‌ర‌కు స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను మొద‌లుపెడుతున్న టీఆర్ఎస్ స‌ర్కారు తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు,ఈట‌ల రాజేంద‌ర్‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమవారం అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాగానే.. ఇదే విష‌యంపై వారు పోడియంలోకి వెళ్లి మ‌రీ నినాదాలు చేశారు. దీంతో వారిని బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని టీఆర్ఎస్ కోర‌డం, అందుకు స్పీక‌ర్ కూడా స‌రేన‌న‌డంతో బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్ నిమిషాల వ్య‌వ‌ధిలోనే పూర్తి అయిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement