Saturday, May 11, 2024

కామారెడ్డి జిల్లాలో దుర్ఘటనపై పవన్ కల్యాణ్ విచారం

కామారెడ్డి జిల్లాలో టాటా ఏస్ వాహనం లారీని ఢీకొట్టిన ఘటనలో 9 మంది మృతి ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కామారెడ్డి జిల్లాలో 9 మంది చనిపోవడం, మరో 14 మంది తీవ్రంగా గాయపడడం బాధాకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసి ఆవేదన కలిగిందన్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. డ్రైవర్ అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. వాహనాల వేగం అదుపునకు రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని తన ప్రగఢ సానుభూతి లిపారు.

కాగా, కామారెడ్డి జిల్లాలో నిన్న ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద అతి వేగంగా వస్తున్న టాటా ఏస్… ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతు సంఖ్య 9కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement