Monday, May 6, 2024

తిరుపతిలో పొలిటికల్ హీట్

తిరుపతిలో పొలిటికల్ హీట్ పెరిగింది. తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల ప్రచార పోరులో భాగంగా ప్రధాన పార్టీల వాడీ వేడీ ప్రసంగాలతో రాజకీయం వెడెక్కనుంది. తమ అభ్యర్థుల పక్షాన ప్రచారంతో దూసుకుపోతున్నాయి. ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యరోపణలతో తిరుపతి లోక్​సభ ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కింది. అధికార వైసీపీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు, ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపే లక్ష్యంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, ఆది మూలపు సురేష్, కన్నబాబు ప్రచారంలో పాల్గొంటున్నారు.   ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి  పనులు, ప్రజలకు అందిస్తున్న పథకాలను చెబుతున్నారు.

మరోవైపపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రచార క్షేత్రంలో దిగారు. ఇప్పటికే తిరుపతిలో మకాం వేసిన నారా లోకేష్.. పనబాక లక్ష్మి తరఫున ప్రచారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు పదను పెట్టారు. గత 22 నెలలుగా రాష్ట్రంలో అరాచక పానల సాగుతోందంటూ విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చె న్నాయుడు సమా మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, తిరుపతి ఉప ఎన్నికల ఇంఛార్జ్ నిమ్మల రామానాయుడు పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

ఇక బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నేడు సమరశంఖారావం పూరించనున్నారు. ఈ ఎన్నికల తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. కాగా, వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనా సోకి మరణించడంతో తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవద్దన్న కృత నిశ్చయంతో అధికార పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement