Saturday, May 4, 2024

పండగ వేళ.. ధరల మంట

గత దసరాతో పోలిస్తే 40% పెరుగుదల – ప్రయాణ చార్జీలూ భారమే
అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: పండగొస్తుంటే చాలు.. అంతా సంబరపడేవారు.. ఇళ్లంతా చుట్టాలు.. ఇంటి నిండా పిండి వంటలు.. కొత్త బట్టలతో అంతా కళకళలాడుతూ కనిపించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పట్నాలతో పాటు పల్లెలకు పండగొచ్చేది. అయితే ఇది ఒకప్పటి మాట.. కరోనా కష్టాలతో పాటు పెరిగిన ధరలతో పండగంటేనే భయపడే పరి స్థి తులు నేడు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల్లో పండగ వాతావరణమే కనిపించడం లేదు. గత ఏడాది న్నర కాలంగా కరోనా, లాక్‌డౌన్‌, చేతినిండా పని లేకపోవడం, ప్రైవేట్‌ ఉద్యోగస్తులకు సరిగ్గా జీతాలు రాకపోతుండడం, వివిధ రకాల వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థి తుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా దశలవారీగా పెరుగుతూ వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 40 శాతం పైగా వంటనూనె, పప్పుదినుసులపై ధరలు పెరిగాయి. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల ఇళ్లల్లో పొయ్యి వెలిగే పరిస్థి తి కూడా కనిపించడం లేదు. దసరా పండుగ సమీపి స్తున్నా అత్యధిక శాతం నిరుపేదలు ఈరోజు వరకు పండగకు అవసరమైన కనీస సరుకులను కూడా కొనుక్కోలేని దీనస్థి తిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రూ. 5 కోట్ల మందికి పైగా జనాభాలో 70 శాతం మంది పేద, మధ్యతరగతి వారే. వారంతా పెరిగిన ధరలతో సతమతమవుతూ పండగ గండం గడిచేదెలా అని చేయూతను అందించే వారికోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థి తుల నేపథ్యంలో కాంట్రాక్టర్లు, చిరువ్యాపారులు, దినసరి కూలీల ఇళ్లల్లో కూడా చూద్దామన్నా దసరా సంబరాలు కనిపించడం లేదు.
కొండెక్కిన.. నిత్యావసరాలు
సాధారణంగా పండుగ రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు స్వల్పంగా పెరుగుతుంటాయి. అయితే పెరిగిన ధరలను లెక్కచేయకుండా పేద, మధ్యతరగతి ప్రజలు పిండి వంటలకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసి పండగ జరుపుకుం టుంటారు. అయితే కరోనా పుణ్యమా ్ట 3| ఓ్లబ…
అని ఏడాదిన్నర కాలంగా సరైన పనులు లేకపోవడం, చేతిలో డబ్బులు కూడా ఆగడం లేదు. ఇదే సందర్భంలో వంటనూనె, పప్పుదినుసులు, చింతపండు, బెల్లం తదితర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 80-90 రూపాయలు ఉన్న వంటనూనె లీటర్‌ ధర ప్రస్తుతం రూ. 160లకు చేరింది. అదేవిధంగా కందిపపు, పెసరపప్పు, మినపప్పు, చెనగపప్పు ధరలు కూడా కేజీపై 20-40 శాతం రేట్లు పెరిగాయి. మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా ధరలు చుక్కలంటుతున్నాయి. దీంతో పూట గడవడమే కష్ట ంగా మారిన లక్షలాది మంది నిరుపేదలు పండగ రోజుల ను సైతం సాధారణంగా గడుపుకునేందుకే మొగ్గుచూపాల్సిన పరిస్థి తులు కనిపిస్తున్నాయి.

కరోనాతో మరింత చితికిన బ్రతుకులు
దసరా వచ్చిందమ్మ.. దశనే మార్చిందమ్మ అంటూ సంబరాలు జరుపుకుంటూ పాటలు పాడుకునే రోజులు పోయాయి. గత ఏడాది మార్చి నుంచి కరోనా మొదటి విడత, సెకండ్‌ వేవ్‌ అన్నీవర్గాల ప్రజలను ఆర్థికంగా దెబ్బతీసింది. ముఖ్యంగా పేదలైతే చితికిపోయారు. రోజూవారీ కూలీ పనులు చేసుకుని పూట గడుపుకునే వారికి ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. కరోనాతో చేతినిండా పనిలేక కుటుంబాన్ని పోషించేందుకు చేతిలో డబ్బులేక అప్పులు చేసి తిరిగి చెల్లించే మార్గంలేక ఏడాది కాలంగా ఆర్థికంగా నలిగిపోతూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఇటువంటి పరిస్థి తులనే ఎదుర్కొంటూ సతమతమవుతున్నారు.
పండగకు ఊరెళ్లాలన్నా భయమే
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజల్‌ ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఫలితంగా ఆర్‌టీసీ, రైల్వేలో స్పెషల్‌ చార్జీల పేరుతో బాదేస్తున్నారు. దీంతో పండగకు అమ్మమ్మ, నానమ్మల ఊర్లకు వెళ్లాలన్నా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయాణం పెనుభారంగా మారింది. గతంలో పండగొస్తుందంటే చాలు పాఠశాలలకు సెలవులు ఇవ్వగానే బంధువుల ఊర్లకు పరుగు తీసేవారు. పట్టణ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లి పండుగ రోజులు అక్కడే గడిపి వచ్చేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థి తులు చూద్దామన్నా కనిపించడం లేదు. పెరిగిన రవాణా భారంతో పేద, మధ్యతరగతి ప్రజలే కాదు.. ఒకస్థాయి కలిగిన కుటుంబాలు సైతం గడపదాటి బయటకు రావడం లేదు. ఇళ్లల్లోనే సింపుల్‌గా పండగ ముగించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పండగ గండం నుంచి గట్టేక్కేదెలా..
గత ఏడాది నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి రూ. 3 వేలతో నిత్యావసర సరుకులు తెచ్చుకుంటే నెలంతా వచ్చేవి. పండగొస్తే మరో రూ. 1500లకు అదనంగా సరుకులు తెచ్చుకుంటే సంతోషంగా పండగ కూడా జరుపుకునేవారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో అదే కుటుంబానికి నెల రోజులకు సరిపడా సరుకులు కావాలంటే రూ. 5 వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక పండగ చేసుకోవాలంటే రూ. 2500లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే 10 మంది సభ్యులున్న పెద్ద కుటుంబమైతే ఖర్చు ఎంతవుతుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. పండగంటే నిత్యావసర సరుకులతో పాటు ఇంటిల్లపాది కొత్త బట్టలు కూడా కొనాలి. ఇలా సగటున ఓ మధ్యతరగతి కుటుంబం దసరా లాంటి పెద్ద పండగను సాధారణంగా ముగించుకోవాలన్నా కనీసం రూ. 5 వేలైనా ఖర్చవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థి తుల్లో ఆర్థికంగా చితికిపోయిన వేలాది కుటుంబాలు పండగ గండం నుంచి ఎలా బయటపడాలా అని బెంగపట్టుకుంది. మరికొంతమందైతే కరోనాతో పాటు పెరిగిన ధరలను దృష్టి లో పెట్టుకుని పండగలను కూడా మర్చిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ నిరుపేద కుటుంబాన్ని కదిలించినా ఇదే దీనస్థి తి.
ఉద్యోగులకు తప్పని తిప్పలు
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే క్రింది స్థాయి ఉద్యోగులు కూడా పండగంటేనే భయపడే పరిస్థి తులు కనిపిస్తున్నాయి. ప్రైవేట్‌ ఉద్యోగుల పరిస్థి తులైతే మరింత దారుణం. ప్రభుత్వ ఉద్యోగుల కు ఒకరోజు అటుఇటుగా జీతాలు చేతికందుతున్నా పెరిగిన ధరలు, కరోనా కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ప్రైవేట్‌ ఉద్యోగులకైతే సకాలంలో జీతాలు రాక కరోనాతో కొన్ని కంపెనీలు తాత్కాలికంగా మూసివేయడంతో పండుగ కాదు కదా.. సాధారణ రోజుల్లో కూడా పూట గడవడమే కష్ట ంగా మారుతోంది. ఆయా కంపెనీల్లో ఉన్నతమైన పదవుల్లో పనిచేసిన కొంతమంది ప్రైవేట్‌ ఉద్యోగులు నేడు పూటగడవక కూలీ పనులకు వెళ్తున్నారంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థి తులను మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థి తుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు, చిరుద్యోగులకు పండగలు వస్తున్నాయంటే భయపడిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement