Thursday, April 25, 2024

Pan-Aadhaar Link : మరో మూడు నెలలు పొడిగింపు

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసేందుకు గ‌తంలో మార్చి 31, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దాన్ని మ‌రో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్‌లను 30 జూన్ 2023 వరకు లింక్ చేయవచ్చు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న తర్వాత, కొత్త ఫిక్స్‌డ్ డేట్ అంటే 30 జూన్ 2023గా నిర్ధారించారు.

ఈ తేదీలో మీరు లింక్ చేయడంలో విఫలమైతే, మీ పాన్ కార్డ్‌తో ఉపయోగంలోకి రాకుండా ఉండిపోతుందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి తేదీ 31 మార్చి 2023.. అయితే ఇప్పుడు దానిని జూన్ 30కి పెంచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని గతంలో చాలాసార్లు పొడిగించారు. ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ పొడిగిస్తూ వస్తున్నారు. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంపై ఆదాయపు పన్నుశాఖ చాలాసార్లు అడిగారు. మీ పాన్- ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ త్వరలో వస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. IT చట్టం, 1961 ప్రకారం, మినహాయించబడిన కేటగిరీలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement