Thursday, April 18, 2024

వాడు క్రిమిన‌ల్ లాయ‌ర్ కాదు.. లా చ‌దివిన క్రిమిన‌ల్.. రావ‌ణాసుర ట్రైల‌ర్

మాస్ అంటే ర‌వితేజ‌… ర‌వితేజ అంటే మాస్ గా పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఈయ‌న ప‌లు ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్టాడు. కాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో ఒక‌టి రావ‌ణాసుర‌. ఈ చిత్రం నుండి ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్’ అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో హీరోగా మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌..హీరోయిన్స్ గా అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత పొన్నాడ కథానాయికలుగా అలరించనున్నారు. రావు రమేశ్ .. సంపత్ రాజ్ .. మురళీ శర్మ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం రావ‌ణాసుర‌.. ఏప్రిల్ 7వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement