Wednesday, May 1, 2024

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా – జాన్వీక‌పూర్ ఫిక్సా

ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ లైగ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. కాగా లైగర్ సినిమాతో విజ‌య్ తెలుగుతోపాటు బాలీవుడ్‌పై కన్నేశాడు. ఇప్పటికే సౌత్‌లో విజయ్‌కి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. డియ‌ర్ కామ్రేడ్ చిత్రాన్ని సౌత్‌ మొత్తం విడుదల చేసి ఆకట్టుకున్నారు. లైగర్ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ మార్క్ మాస్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఆగస్ట్ లో రాబోతుంది.
రోవైపు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో జ‌న‌గ‌ణ‌మ‌న‌ చిత్రం చేయబోతున్నారు. అయితే ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ ఫైనల్‌ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల హిందీ నిర్మాత అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో తారలు పాల్గొన్నారు. అందులో భాగంగా పూరీ జగన్నాథ్, చార్మీతోపాటు విజయ్‌ దేవరకొండ కూడా పాల్గొన్నారు. లైగర్ హీరోయిన్‌ అనన్యా పాండే హాజరైంది. వీరితోపాటు పలువురు బాలీవుడ్‌ తారలు మెరిశారు. అందులో జాన్వీ కపూర్‌ కూడా ఉంది. ఈ పార్టీలోనే లైగర్ టీమ్‌ ఓ ఫోటో దిగగా, జాన్వీ కపూర్‌తో మరో ఫోటో దిగారు విజయ్‌, చార్మీ. ప్రస్తుతం ఈ పిక్‌ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. దీంతో నెక్ట్స్ పూరీ, విజయ్‌ సినిమాలో హీరోయిన్‌ కన్ఫమ్‌ అని తేల్చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే ఇందులో మనీష్‌ మల్హోత్రా కూడా ఉన్నారు. విజయ్‌ డైరెక్ట్ హిందీలోనూ కరణ్‌ జోహార్‌ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారని, అందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా విజయ్‌ అంటే క్రష్‌ అని చెప్పిన జాన్వీ ఎట్టకేలకు ఆయనతో సినిమా చేసే ఛాన్స్‌ కొట్టేసిందని కామెంట్లు చేస్తున్నారు ఇంటర్నెట్‌ అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement