Monday, May 6, 2024

No-trust vote: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వాయిదా..

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కు స్వల్ప ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్‌ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే జాతీయ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సభ మార్చి 28న మళ్లీ సమావేశం కానుంది. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో తమ పక్షాలకు తగిన సంఖ్యాబలం ఉందని ఇరుపక్షాలు పేర్కొంటున్నాయి.

శుక్రవారం పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా ఇటీవ‌ల మృతిచెందిన నేత‌ల‌కు నివాళి అర్పించిన త‌ర్వాత జాతీయ అసెంబ్లీ స‌మావేశాన్ని సోమ‌వారానికి వాయిదా వేశారు. ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని మార్చి 8వ తేదీన ప్ర‌తిప‌క్షాలు అభ్య‌ర్థ‌న ప‌త్రాన్ని స‌మ‌ర్పించాయి. సుమారు 152 మంది ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు. అయితే ఇవాళ పార్ల‌మెంట్ మొద‌టి రోజు నేప‌థ్యంలో ఇటీవ‌ల మృతిచెందిన నేత‌ల‌కు నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత స‌భా కార్య‌క‌లాపాల‌ను వాయిదా వేశారు. మార్చి 28వ తేదీన ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 95 ప్ర‌కారం అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement