Friday, April 26, 2024

పేరుకే అంత‌ర్జాతీయ హోదా…. స‌ర్వీస్ లు మాత్రం నిల్..

అమరావతి,ఆంధ్రప్రభ:రాష్ట్రంలోనిఎయిర్‌పోర్టులకు అంతర్జాతీయ హోదా దక్కినా ఆ స్థాయిలో సర్వీసులు మాత్రం నడ వని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రం నుంచి విమనాయాన ప్రయాణీకుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతూ వస్తున్నా, దానికి అనుగు ణంగా విమానయాన సం స్థలు సర్వీసులను అందుబాటులోకి తీసుకు రావడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో అంతర్జాతీయ హోదా దక్కిం చుకున్న గన్నవరం, విశాఖ విమానాశ్రయాల దశ మారని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో గన్నవరం, విశాఖ విమనాశ్రయా లకు విదేశీ సర్వీసులు నిత్యం నడిచేవి. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణీకులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రము ఖులు సాధారణ ప్ర యాణీకులతో కళకళలాడుతూ కనిపించేవి. సింగ పూర్‌, శ్రీలంక, మలేషియా, అరబ్‌ దేశాలకు విమానాలు నడిచేవి. గడిచిన నాలుగేళ్లుగా ఒక్కొక్క విదేశీ సర్వీసు కనమరుగౌతూ వచ్చింది. ఆ తర్వాత కోవిడ్‌ ప్రభావంతో గత రెండేళ్లుగా సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.

గన్నవరం విమనాశ్రయానికి అంతర్జా తీయ హోదా కొనసా గుతూ వచ్చినా విశాఖకు ఈ హోదాను నిలిపే శారు. ప్రస్తుతం విశాఖ నుంచి ఒక్క సింగపూర్‌కు మాత్రమే విమాన సర్వీసు నడుపుతు న్నారు. అంతర్జాతీయ హోదాను కోవిడ్‌ సమ యంలో నిలిపివేయగా ఇప్పుడు దానిని పునరుద్దరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గన్నవరం విమ నాశ్రయం నుండి ప్రస్తుతం షార్జాకు వారంలో రెండు రోజుల పాటు సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే దుబాయ్‌కు మరో సర్వీసు నడుపు తున్నారు. రెండు ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్‌ల నుండి మూడు విదేశీ సర్వీసులే నడడవంతో అంతర్జాతీయ హోదా కేవలం నామా మాత్రమే అన్నట్లుగా స్పష్టమౌతుందని ప్ర యాణీకులు పెదవి విరు స్తున్నారు. కేవలం మొక్కుబడి సర్వీసులతో ఏ మాత్రం ప్రయోజనం లేదని నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి విశాఖ, గన్నవరం అంతర్జాతీయ విమనాశ్రయాలు దాదాపు పది ఉమ్మడి జిల్లాల ప్రజల కు ఎంతో అందుబాటులో ఉన్నపరిస్థితి. విదేశాల నుంచి రాక పోకలు సాగించేవారంతా గతంలో ఈ రెండు విమనాశ్రయాల నుం డే నేరు గా ప్రయాణాలు సాగించేవారు. అయితే ఇప్పుడు సర్వీసులు లేకపోవ డంతో పోరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ నుంచి విదేశాల్లోని తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో సమయంతోపాటు ఖర్చు కూడా పెరుగుతుందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు 16వేల మంది ప్రయాణీకులు
ఇదిలా ఉంటే , గన్నవరం, విశాఖ విమనాశ్రయాల నుండి రోజుకు సగటున 16 వేల మందికి పైగా ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నట్లుగా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది గన్నవరం విమనాశ్రయం నుంచి ఏడు లక్షల 32 వేల మంద ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఇక విశాఖ నుంచి కూడా ఇదే స్థాయిలో ప్రయాణీకులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకు న్నారు. ఇంత రద్దీ ఉన్నా ప్రయాణీకుల నుంచి మంచి స్పందన కనిపి స్తున్నా సర్వీసులు మాత్రం నడిపేందుకు విమానాయన సంస్థలు ముందుకురాని పరిస్థితి ఉంది. కనీసం సర్వీసులు పెంచేందుకు విమానయాన సం స్థలపై ఒత్తిడి తెచ్చేవారు కూడా లేకపోవడంతో రోజురోజుకీ ఈ విమనాశ్రయాలు కళాహీనమౌతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement