Friday, May 20, 2022

టాలీవుడ్ ని విడిచిపెట్టే ఆలోచ‌న లేదు-బాలీవుడ్ న‌న్ను భ‌రించ‌లేదు-మ‌హేశ్ బాబు

బాలీవుడ్ ప‌రిశ్ర‌మ త‌న‌ని భ‌రించ‌లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు..హిందీ పరిశ్రమ నుంచి నాకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా నా సమయం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇక్కడి పరిశ్రమలో నాకు వచ్చిన గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. కనుక నా పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన నేను చేయను. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంద‌న్నారు. మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది.రెండేళ్ల విరామం తర్వాత మహేశ్ బాబు కనిపించబోయే సినిమా ఇది. చివరిగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఆయన నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement