Friday, May 20, 2022

10 అడుగుల లోతులో పడిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని హైవే పై బద్దెవోలు క్రాస్ రోడ్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దాని వెనుకనే వస్తున్న లారీ కూడా బోల్తా పడింది. దీంతో కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి చెందిన ఎస్.కె కరీమా(65) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్ర‌మాదంలో 20 మందికి పైగా గాయాల్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎస్.ఐ ముత్యాల రావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అంబులెన్స్ లలో హాస్పిటల్ కి తరలించారు. ప్ర‌మాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..Advertisement

తాజా వార్తలు

Advertisement