Friday, May 3, 2024

Good News: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.62 వద్ద ఉంది. ఏపీలో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.

కాగా, గత నెల రోజులుగా ఇంధన ధరలు పెరగడం లేదు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలను పరిగణనలోకి తీసుకుని దేశీయంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మారుస్తూ ఉంటాయి. అయితే గత నెల రోజులుగా ఈ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement