Sunday, May 5, 2024

వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

చమరు సంస్థలు వాహనదారులకు కాస్తంత ఊరటనిచ్చాయి. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.91 ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 105.08కు చేరింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.69 కాగా.. డీజిల్‌ ధర రూ. 106.26 లుగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.32గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.38గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.52 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.100.59గా ఉంది.

ఇది కూడా చదవండి: గులాబీ వేడుక.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్!

Advertisement

తాజా వార్తలు

Advertisement