Friday, November 8, 2024

Delhi: ఎమ్మెల్యే చిన్న‌య్య‌పై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని.. శేజ‌ల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె విషం తాగారు. దీంతో వెంటనే స్పందించిన తోటివారు శేజల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

అయితే.. దుర్గం చిన్నయ్య తనను మానసికంగా , లైంగికంగా వేధిస్తున్నారని బోడపాటి శేజల్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement