Sunday, October 1, 2023

Breaking: నిర్మలా సీతారామన్ మీడియా మీట్ క్యాన్సిల్‌.. ప‌థ‌కాల అమ‌లుపై అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మేనా?

తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు కేంద్ర ఆర్థిక‌ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌. అయితే తెలంగాణ‌లో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లుకావ‌డం లేద‌ని, ఆయుష్మాన్ భార‌త్‌లో తెలంగాణ చేర‌లేద‌ని త‌న ప‌ర్య‌ట‌న‌లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇవ్వాల​ (శుక్రవారం) మధ్యాహ్నం మూడు గంటలకు బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెడతామని తెలియ‌జేశారు. కానీ, తెలంగాణ ఆర్థిక‌, ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్రెస్ మీట్ పెట్టి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పిన మాట‌ల‌న్నీ అబ‌ద్ధాల‌ని రుజువు చేశారు. దీంతో లోక‌ల్ లీడ‌ర్లు త‌న‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌పై పూర్తి వివ‌రాలు తెలుసుకున్న త‌ర్వాత‌నే మ‌రోసారి వ‌చ్చి మాట్లాడుతాన‌ని మీడియాతో మాట్లాడ‌కుండానే వెనుదిరిగారు నిర్మ‌లా..

తొలుత ప‌థ‌కాల‌పై క్లారిటీ లేని ప్రసంగం చేశానని గమనించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారాం. ఇప్ప‌టికీ త‌న‌కు ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం చేరిందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొర‌క్క‌పోవ‌డం, మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇవ్వడంతో అయోమయంలో ప‌డ్డారు. కేంద్ర పథకాలపై మరింత అధ్యయనం చేసిన తర్వాత హైదరాబాద్‌లో దీని గురించి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతారు అని మీడియాకు ఆమె పీఆర్‌వో తెలిపారు.

- Advertisement -
   

ఏది ప‌డితే అది మాట్లాడితే తెలంగాణ సమాజం నుండి ప్రతిఘటన ఎదురవుతుంద‌ని బీజేపీ నేత‌లు గ‌మ‌నించారు. అందుకే అర్ధాంతరంగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేసుకొని కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాగా, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మీడియాకు చాన్స్ ఇవ్వ‌లేదు. దీంతో మీడియా సిబ్బంది, జ‌ర్న‌లిస్టులు కేంద్ర మంత్రి, బీజేపీ నేత‌ల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement