Tuesday, May 7, 2024

ఫ‌స్ట్ టైం ముఖానికి మాస్క్ లేకుండా క‌నిపించిన మంత్రి ‘సిరాజుద్దీన్ హ‌క్కానీ’

ఆప్ఘ‌నిస్థాన్ లో కొత్త పోలీసుల నియామ‌కాల్లో భాగంగా నిర్వ‌హించిన పాసింగ్ అవుట్ ప‌రేడ్ లో ఆప్ఘ‌నిస్థాన్ అంత‌ర్గ‌తశాఖ మంత్రి సిరాజుద్దీన్ హ‌క్కానీ మొద‌టిసారి ముఖానికి మాస్క్ లేకుండా క‌నిపించారు. హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ అయిన సిరాజుద్దీన్‌ ఫొటోలు గతంలో వెలుగులోకి వచ్చినప్పటికీ అవన్నీ వెనక నుంచి తీసినవే. కాబట్టి ఆయన ఎలా ఉంటారన్న విషయం ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియదు. గత ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఆయన బయటకు రాలేదు. తాజాగా, పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో కనిపించిన ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ సంతృప్తి కోసం, మీలో నమ్మకాన్ని పెంపొందించడం కోసం మీకోసం బహిరంగ సభలో మీడియా ముందు కనిపిస్తున్నాన‌న్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముందు హక్కానీ నేత హిబతుల్లా అఖుంద్‌జాదా ముగ్గురు డిప్యూటీలలో హక్కానీ అత్యంత సీనియర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement