Thursday, May 16, 2024

BRS Madhu | కేసీఆర్​ సారును మంచిగా దీవించాలే.. ఏడు కొండలకు నడిచొస్తానన్న నీలం మధు

బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి మెజార్టీ సాధించాలి. తెలంగాణలో హ్యాట్రిక్​ కొట్టాలని ఏడుకొండల ఎంకన్నను వేడుకున్నారు బీఆర్​ఎస్​ నేత నీలం మధు ముదిరాజ్​. ఇవ్వాల ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లే ముందు ‘ఆంధ్రప్రభ’తో మాట్లాడారు. మూడోసారి కేసీఆర్‌ సారు ముఖ్యమంత్రి  కావాలని, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పటాన్​చెరు నుంచి పాదయాత్రగా వస్తానని ఏడుకొండల స్వామికి మొక్కినట్లు నీలం మధు తెలిపారు. దేశ్​కీ నేతగా కీలకంగా మారాలని, రాష్ట్రంలోనూ ఎదురులేని లీడర్​గా ఉండాలని కోరుకున్నారు.

– ప్రభన్యూస్​ బ్యూరో, ఉమ్మడి మెదక్​

బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకుడు, పటాన్​చెరు కీలక నేత నీలం మధు ముదిరాజ్​ ఇవ్వాల (బుధవారం) తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. పటాన్​చెరు నియోజకవర్గం నుంచి దాదాపు 30 మంది ఎన్​ఎంఆర్​ యువసేన సభ్యులతో తిరుపతిలోని అలిపిర నుంచి కాలినడకన ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను షేర్​ చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కీలకంగా మారాలని కోరుతూ తిరుమలేశుని వేడుకున్నట్టు నీలం మధు తెలిపారు.

కేసీఆర్‌ లాంటి విజన్‌ ఉన్న నాయకుడు, ఉద్యమనేత దేశరాజకీయాలకు ఎంతో అవసరం నీలం మధు అన్నారు.  ఆ ఏడుకొండలస్వామి కేసీఆర్‌ సార్​ను రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి చేయడమే కాకుండా  దేశరాజకీయాలను శాసించే నేతగా మార్చేలా చూడాలని తాను మొక్కుకున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రాష్ర్టాల నుంచి కూడా నాయకులు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం అవుతోందన్నారు. 

- Advertisement -

ప్రస్తుతం పరిస్థితిలో దేశ రాజకీయాలకు కేసీఆర్‌ వంటినేత ఎంతో అవసరమన్నారు నీలం మధు ముదిరాజ్​. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని ఆయన స్పష్టంచేశారు. అనుకున్న విధంగా కేసీఆర్ సార్ భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే తాను పటాన్​చెరు నుంచి పాదయాత్రగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్టు వెల్లడించారు. ఇక.. కేసీఆర్​ సార్​ వెంటే ఉండి బీఆర్‌ఎస్‌ కు ఎనలేని సేవలు అందించే అవకాశం తనకు కల్పించాలని, ఎలాంటి అవకాశం ఉన్నా తాను అందుకు రెడీగా ఉంటానని మధు స్పష్టం చేశారు. ఆ వేంకన్న స్వామి, కేసీఆర్ సార్ కృప తనపై, నియోజకవర్గ ప్రజలపై నిరంతరం ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement