Saturday, April 27, 2024

వైర‌ల్ అవుతోన్న బాల‌కృష్ణ ఫైట్ సీన్స్-ట‌ర్కీలో షూటింగ్

నెటింట్లో హీరో బాల‌కృష్ణ కొత్త మూవీకి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న మాస్ యాక్ష‌న్ సినిమాను చేస్తున్నారు బాల‌య్య‌. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ టర్కీలో జరుగుతుంది.
టర్కీలో బాలయ్య అభిమానులు షూటింగ్‌ స్పాట్‌కు వచ్చి, వీడియోలు తీస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బాలయ్యకు రౌడీలకు మధ్య ఫైటింగ్‌ జరుగుతుంది. బాలయ్య ఓ రౌడీ చేయి నరికి అటు ఇటు తిరుగుతున్నారు. బాలయ్యను చూస్తూ రౌడీలంతా భయంతో .. కోపంతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement