Thursday, May 2, 2024

ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు, జరిమానా

యూపీ–బిహార్​ సరిహద్దుల్లోని మురాజఫర్​నగర్​ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యే దోషిగా తేలారు. 2013లో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి 60 మంది మరణానికి కారణమయ్యారని, మరో 40వేల మంది నిరాశ్రయులయ్యారని ఈ కేసు విచారణ సందర్భంగా రుజువు అయ్యింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్​ సైనీతోపాటో ఈ మత ఘర్షణలకు కారణమైన మరో 11 మందికి ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు రెండేండ్ల జైలు శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బిహార్​ రాష్ట్రం, ముజఫర్​నగర్​లో 2013లో చెలరేగిన మత ఘర్షణలపై ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో విచారణ పూర్తయ్యింది. ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీతో పాటు మరో 11 మందికి ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి గోపాల్ ఉపాధ్యాయ ఈ అల్లర్లు, ఇతర నేరాలకు గాను వారిని దోషులుగా నిర్ధారించారు.  ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా కూడా విధించారు. ఇంకా ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 15 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సైనీ.. ఈ తీర్పుపై అప్పీలు చేస్తానని చెప్పారు.

ఎమ్మెల్యేతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని, హైకోర్టును ఆశ్రయించినందుకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. 12 మందిని IPC సెక్షన్లు 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), 353 (ప్రభుత్వ సేవకుడు తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకుని దాడి చేయడం), 147 (అల్లర్లు), 148 (మారణకాయుధాలను కలిగి అల్లర్లకు పాల్పడడం) , 149 (చట్టవిరుద్ధంగా సమావేశం జరపడం) వంటి సెక్షన్ల కింద నేరాలు రుజువయ్యాయి.

ఇక.. ఎమ్మెల్యే విక్రమ్ సైనీపై కూడా జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు జాట్ యువకుల దహన సంస్కారాలు ముగించుకుని జనం తిరిగి వస్తుండగా కవాల్ గ్రామంలో జరిగిన హింసాకాండలో బీజేపీ ఎమ్మెల్యే, మరో 26 మంది ఇతర వ్యక్తులు ఘర్షణలకు కారణమయ్యారు. సెప్టెంబర్ 2013లో ముజఫర్‌నగర్.. పరిసర ప్రాంతాలలో మత ఘర్షణలను ప్రేరేపించారు. ఇందులో 60 మంది ప్రాణాలు కోల్పోయారు.  40,000 మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement