Friday, April 26, 2024

Good News: వారందరికీ మార్చి వరకు ఫ్రీ రేషన్!

కేంద్ర ప్రభుత్వంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్‌ పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. “ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన”ను 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

కరోనా లాక్‌డౌన్ అనంతరం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ పథకాన్ని కేంద్రం అమలు చేసింది. తాజా నిర్ణయం అమలుతో ప్రభుత్వంపై రూ.53,344.52 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement