Wednesday, March 27, 2024

Breaking: పైప్ లైన్ నుంచి నోట్ల కట్టలు.. కర్నాటకలో ఏసీబీ రైడ్స్.. 15 మందిపై, 68 చోట్ల సోదాలు..

క‌ర్నాట‌క‌లో యాంటీ క‌ర‌ప్ష‌న్ బ్యూరో (ఏసీబీ) ఈ రోజు (బుధ‌వారం) పెద్ద ఎత్తున్న సెర్చింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తోంది. లంచాలు తీసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌లు విభాగాల‌కు చెందిన‌ 15 మంది అధికారుల‌ను టార్గెట్ చేసుకుని.. వారికి సంబంధించిన 68 ప్ర‌దేశాల్లో సోదాలు చేప‌ట్టింది. బెంగ‌ళూరు డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీతో పాటు బెంగ‌ళూరు హెడ్ క్వార్ట‌ర్‌లోని ప‌లు ఆఫీసుల్లో ఈ మాసివ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.
మంగ‌ళూరు, బెంగ‌ళూరు, మాండ్యా ఏరియాల్లో ఉన్న ప‌లువురు అధికారుల నివాసాలు, బంధువుల ఇళ్ల‌ల్లో ఒకేసారి సోదాలు నిర్వ‌హిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనికి ఎనిమిది మంది ఎస్‌పీలు, 100 ఆఫీస‌ర్లు, 300 మంది ఏసీబీ స్టాఫ్ తో ఈ రైడ్స్ నిర్వ‌హించారు.

కాగా, ఏసీబీ దాడుల్లో అధికారులు K.S. లింగేగౌడ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్మార్ట్ సిటీ, మంగళూరు; శ్రీనివాస్ కె. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, HLBC, మాండ్య; గడగ్‌లో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు టి.ఎస్.రుద్రేశప్ప; సవదత్తి సహకార అభివృద్ధి అధికారి ఎ.కె. మస్తీ; సదాశివ మరలింగన్ననవర్, సీనియర్ మోటార్ ఇన్స్పెక్టర్, గోకాక్; నాథాజీ హీరాజీ పాటిల్, బెలగావిలోని హెస్కామ్‌లో గ్రేడ్ ‘సి’ ఉద్యోగి; S. M. బిరాదార్, జూనియర్ ఇంజనీర్, PWD మరియు K. S. శివానంద్, రిటైర్డ్ సబ్-రిజిస్ట్రార్; బళ్లారి ఉన్నారు.

కాగా, ఓ జూనియ‌ర్ ఇంజినీర్ ఇంట్లో సోదాలు చేస్తున్న క్ర‌మంలో ప్లాస్టిక్ పైప్ నుంచి పెద్ద మొత్తంలో నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వామ్మో అధికారుల అవినీతి మామూలుగా లేదు అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement