Saturday, May 4, 2024

హైదరాబాద్​లో ఉద్రిక్తత.. మసీదు స్థలంలో విగ్రహ ప్రతిష్ఠాపన, గొర్రె పొట్టేలును బలి ఇచ్చి పూజలు

మసీదు స్థలంలోకి చొరబడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గొర్రె పొట్టేలును బలి ఇచ్చిన ఘటన హైదరాబాద్​లో కలకలం రేపింది. రాయదుర్గంలోని కుతుబ్ షాహీ మసీదు ప్రాంగణంలోకి ఆదివారం గుంపుగా వచ్చిన కొంతమంది విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు చేశారు. దీంతో హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. మసీదు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కం చెరువు వద్ద ఉన్న కుతుబ్ షాహీ మసీదు భూమిలోకి కొంతమంది అక్రమంగా చొరబడి అక్కడున్న చిన్న కొండపై విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు తెలుస్తోంది.

ఆలయానికి, మసీదుకు కేటాయించిన భూమి విషయంలో గందరగోళం నెలకొనడంతో ఈ ఉద్రిక్తతలు తలెత్తినట్లు సమాచారం. 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ మసీదుకు ఎదురుగా కట్ట మైసమ్మ ఆలయం ఉంది. దీని కోసం 18 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టిన నేపథ్యంలో రహదారి అభివృద్ధిలో భాగంగా ఈ ఆలయాన్ని తరలిస్తున్నారు. ఆ స్థలం మసీదు ప్రాంగణంలో ఉందని ఆలయ అధికార వర్గాలు పేర్కొన్నాయి.

దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అధికారుల ద్వారా సర్వే చేసి, పరిశీలించిన తర్వాత భూమికి హద్దులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది అక్రమార్కులను ఆదివారం అక్కడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మసీదు ఆవరణలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, స్థానిక హిందూ సంఘాలు మాత్రం ఈ అక్రమాస్తుల ఘటనలో తమ ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నాయి.

- Advertisement -

ఇక.. వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ సలీమ్ మాట్లాడుతూ.. ఈ భూమి వక్ఫ్ ఆస్తి అని, గోల్కొండ కుతుబ్ షాహీ వంశం సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నుంచి ఇక్కడ మసీదు ఉందన్నారు. ప్రభుత్వం, పోలీసుల సహాయంతో తాము అక్కడ ప్రార్థనలను చేపడుతున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement