Thursday, May 16, 2024

చిన్న జీయ‌ర్ స్వామిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే ‘సీత‌క్క’ – మీలా దైవ‌ద‌ర్శ‌నానికి టిక్కెట్ పెట్ట‌లే

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. చిన్న జీయర్ స్వామి సమ్మక్క సారలమ్మ లపై చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలి..వన దేవత లపై చిన్న జీయర్ స్వామి కి అక్కస్సు ఎందుకు అని నిల‌దీశారు. ఈ రోజు తాడ్వాయి మండలం లోని శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ .. ఆంధ్ర చిన్న జీయర్ స్వామి.. మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు వెనక్కి తీసుకోవాలి క్షేమపణ చెప్పాలని ..మా తల్లుల ది వ్యాపారమా, మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ .. మీరు మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు టికెట్ ధర పెట్టారు మీది బిజినెస్.. మా సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు.. లక్ష రూపాయల తీసుకోకుండా ఏదైనా పేద వారి ఇంటికి మీరు వెళ్ళారా ..

తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయిన చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవి చందర్,తాడ్వాయి ములుగు మండలాల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, ఎండీ చాంద్ పాషా, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పిరిల వెంకన్న, సర్పంచ్ రేగ కల్యాణి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,సీతక్క యువసేన మండల అధ్యక్షుడు చర్ప రవీందర్..సహకార సంఘం డైరెక్టర్ మల్లయ్య..మాజీ సర్పంచ్ శ్రీనివాస్,గజ్జెల ప్రసాద్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,నరేందర్, సుధాకర్, నర్సింహులు,రాజయ్య,వెంకట్ రెడ్డి స్వామి,నారాయణ,సంభ శివ రావు మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement