Monday, April 29, 2024

Sircilla: అంబేద్కర్ కమ్యూనిటీ భవనం సిద్ధం.. ప్రారంభించనున్న కేటీఆర్

జిల్లా కేంద్రం సిరిసిల్లలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో అధునాతన వసతులతో కూడిన నూతన అంబేద్కర్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సిరిసిల్ల-వేములవాడ బైపాస్‌ రోడ్డులో నర్సింగ్‌ కళాశాల సమీపంలో ఎకరం స్థలంలో ఎస్సీ సంక్షేమశాఖ నిధులు రూ.2కోట్లతో అంబేద్కర్ భవనం నిర్మించారు. G+1 విధానంలో నిర్మాణమైన ఈ భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో మల్టీ పర్పస్ హల్ , కిచెన్‌, VIP లాంజ్, కార్యాలయ గది, సెమినార్ హల్ లను నిర్మించారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఆడిటోరియంను నిర్మించారు. ఆడిటోరియంలో వంద మంది కూర్చునేలా సీటింగ్‌ను అమర్చారు. ఆడిటోరియంలో కమ్యూనిటీ ప్రజలు సమావేశాలు, వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలు, సమావేశాలు, సెమినార్ లు నిర్వహించుకునేందుకు అనువుగా భవనం ను తీర్చిదిద్దారు.పార్కింగ్ కు సైతం ఏర్పాట్లు చేశారు. అన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దిన అంబేద్కర్‌ భవనంను ఈ నెల 14న అంబేద్కర్‌ 131 వ జయంతి రోజు రాష్ట్ర ఐటి, పురపాలక పట్టాభివృద్ధిశాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement