Thursday, May 2, 2024

ఏడో విడత హరితహారం.. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడోవిడత హరితహారం కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పెద్ద అంబర్​పేట్​ కలాన్​ వద్ద మంత్రి కేటీఆర్ మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభించారు. అనంతరం కలాన్‌లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్​ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం మళ్లీ ప్రారంభమైందని తెలిపారు. ఏడో విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి దాదాపు 20 కోట్ల మొక్కలు నాటనున్నట్లు కేటీఆర్​ వెల్లడించారు. దానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలని సూచించారు. రహదారుల వెంట బహుళ దశల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.

ఇది కూడా చదవండి: రేవంత్‌రెడ్డికి పెరుగుతున్న బలం.. కొండా మద్దతు కూడా ఆయనకే

Advertisement

తాజా వార్తలు

Advertisement