Friday, May 3, 2024

మూడోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న మంత్రి హ‌రీశ్ రావు – టీటీడీలో ప్ర‌త్యేక పూజలు

2022-23 బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా… అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న‌రాష్ట్ర ఆర్థిక‌, ఆరోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుతో క‌లిసి హైద‌రాబాద్ లోని ఫిల్మ్ న‌గ‌ర్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ సంద‌ర్భంగా మంత్రి ద‌యాక‌ర్ రావు గారు హ‌రీశ్ రావుకి శుభాకాంక్ష‌లు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా అభివృద్ధి చెందుతున్న‌ద‌ని, సంక్షేమంలో అగ్ర‌గామిగా ఉంద‌ని, రాష్ట్రం బంగారు తెలంగాణ మారుతున్న‌ద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర‌స‌గా మూడోసారి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌బోతున్న హ‌రీశ్ రావు గారికి మంత్రి ద‌యాక‌ర్ రావు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంతోపాటు అభినంద‌న‌లు అంద‌చేశారు. సిఎం కెసిఆర్ నాయ‌కత్వంలోని ప్ర‌భుత్వం ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గా ఉండాల‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లు అద్భుత‌మైన అభివృద్ధి, సంక్షేమాల‌ను అందించాల‌ని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement