Tuesday, April 30, 2024

రాజ్ భవన్ కు కాషాయ రంగు.. గవర్నర్ ను రాజకీయాల్లోకి లాగుతారా?: బీజేపీపై హరీష్ ఫైర్

బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. మహిళ అయినందుకే గవర్నర్ ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ప్రధాని మోడీ పీఎం కాగానే గుజరాత్ గవర్నర్ కమల బెణివాల్ ను డిస్మిస్ చేశారని గుర్తు చేశారు. రాజ్ భవన్ కు కాషాయం రంగుపూసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆరెస్ ఆరిపోయే దీపం కాదు- దేశానికి దారి చూపే కాగడ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎప్పటికీ వెలగని దీపం బీజేపీ అని విమర్శించారు. అవగహన రహిత్యంతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గవర్నర్ మహిళ కాబట్టే అవమానిస్తున్నారని బీజేపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అస్సాం సీఎం హేమంతబిస్వ శర్మ మాతృమూర్తులపై చేసిన వాఖ్యలను సమర్దించిన బండి సంజయ్ కి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని గవర్నర్ ను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెడుతుంది బీజేపీ కాదా ? అని నిలదీశారు. గవర్నర్ ను అవమానించే ఉద్దేశ్యం తమకు లేదన్న మంత్రి హరీష్.. మహిళ పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. బీటీ బచావో,బేటీ పడావో ప్రోగాంకు కేటాయించిన నిధులలో 80శాతం మోడీ ప్రచారానికి ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఇది ఆడ పిల్లల మీద బీజేపీకి ఉన్న గౌరవం అని ఎద్దేవా చేశారు.

రాజ్ భవన్ కు కాషాయ రంగు ఎందుకు వేస్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రాజ్ భవన్ కు బీజేపీకి ఎం సంబందం అని నిలదీశారు. ఏదైనా ఉంటే గవర్నర్ కు ప్రభుత్వం వివరణ ఇస్తుందన్నారు. ప్రోరోగ్ కానీ అసెంబ్లీ కొత్త సెషన్ కాదన్నారు. బీజేపీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. మోడీ పాకిస్థాన్ ప్రధానమంత్రి తల్లి కాళ్ళు మొక్కితే దేశ భక్తి.. మేము కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే దేశం ద్రోహం ఎలా అవుతుందని అడిగారు. బండి సంజయ్ రాజ్యంగంలో ఏముందో తెలుసుకోవాలని హితవు పలికారు. సంజయ్ ముందు నీ పార్టీని చక్కదిద్దుకో..నీ పార్టీలో రహస్య మీటింగ్ లు జరుగుతున్నాయని సూచించారు. తమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. బీజేపీ మత రాజకీయాలు చేయాలనుకుంటుందని, అది తెలంగాణలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాను బీజేపీ కూలగొట్టిందని ఆరోపించారు. తెలంగాణ పథకాలు అమలు చేయాలని ఇతర రాష్ట్ర రైతులు అక్కడి ప్రభంత్వాలపై ఓత్తిడి తెస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం సరికాదన్నారు. ప్రొరోగ్ కాలేదు కనుకే గవర్నర్ ను పిలువ లేదన్నారు. దేశ భక్తి గురించి మాకు బీజేపీ చెప్పనవసరం లేదని మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement