Friday, May 3, 2024

తడిచిన ధాన్యం ప్రభుత్వమే కొంటుంది: మంత్రి గంగుల

తెలంగాణ ధాన్యం కొనడం కేంద్రానికి ఇష్టం లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాన్నారు. కొనుగోలు కేంద్రాలు, గన్ని బ్యాగ్ లుపై శ్వేతా పత్రం విడుదల చేశారు. కొనుగోలు ప్రారంభం కాగానే ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో రైస్ మిల్స్ పై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. అసలు FCI కి ఏం సంబంధం ఉందని దాడులు చేస్తున్నారని మంత్రి గంగుల ప్రశ్నించారు. FCI తనిఖీలతో ధాన్యం కొనుగోళ్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోళ్లు అయిపోయాక తనిఖీలు చేస్తే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మిల్లర్ లు అక్రమాలు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రానికి ఏం సంబంధం అని అడిగారు. జులైలో FCI తనిఖీలు చేస్తే మేము సహకరిస్తాం అని పేర్కొన్నారు. వరి పండించే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని, అందుకే ఇంతలా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కోణంతోనే ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి తడిచిన ధాన్యం ప్రభుత్వం కొంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి గంగుల హామీ ఇచ్చార.

Advertisement

తాజా వార్తలు

Advertisement