Thursday, May 9, 2024

మతి పోగొడుతున్న మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లోనే..

అహ్లాదపూరిత వాతావరణం.. రంగురంగుల పూలు.. ఆకర్షణీయమైన మొక్కల మధ్య వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది క‌దా.. అవును.. ఇక హైద‌రాబాద్ ప్రజలు ఎంజాయ్‌ చేసేలా రాయదుర్గంలోని పురాతన మల్కంచెరువు పూర్తి స్థాయిలో రెడీ అయ్యింది. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీకి ద‌గ్గ‌ర‌లో, పురాతన జాతీయ రహదారికి పక్కనే ‘రోడ్‌ సైడ్‌ లేక్‌’ కావడంతో మల్కంచెరువుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సుందరీకరించారు. దీన్ని మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. పగలు ఎంతో ఆహ్లాదంగా.. రాత్రివేళ‌ విద్యుత్‌ వెలుగుల్లో ఈ చెరువు ప్రాంతం చూపరులను క‌ట్టిప‌డేస్తోంది.. మైమ‌రిచిపోయే అనుభూతుల‌ను అందిస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement