Sunday, May 5, 2024

మినరల్ వాటర్ తాగొచ్చా..?

ఈ రోజుల్లో ఎవరు కూడా సాధారణ వాటర్ తాగడం లేదు.. అందరు కూడా మినరల్ వాటర్ తాగుతున్న వారే.. అయితే మనం తాగుతున్న మినరల్ వాటర్ లో ఎంత వరకు పోషకాలు ఉంటున్నాయి..అనే విషయాన్ని ఓ సారి పరికించి చూస్తే విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. మొదటగా మీరు టీడీఎస్ మీటర్ ను కొనుగోలు చేయండి. 200 రూపాయల్లో మీకు మంచి టీడీఎస్ మీటర్ మార్కెట్లో దొరుకుతుంది. టీడీఎస్ అంటే Total Dissolved Solids. టీడీఎస్ 100 నుంచి 500 వరకు ఉంటే అది మనుష్యులు తాగేందుకు అనువైన నీరు. అంటే అందులో మన శరీరానికి కావలసిన మినరల్స్, మెటల్స్, సాల్ట్స్ అన్ని సరైన మోతాదులో ఉంటాయి. అత్యుత్తమైన నీరు యొక్క టీడీఎస్ 100 నుంచి 300 మధ్య ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 100 కంటే తక్కువ టీడీఎస్ ఉన్న నీటిలో మన శరీరానికి అవసరమైన మినరల్స్ లేనట్టు . అటువంటి నీరు దాహం తీర్చేందుకు తప్ప మన శరీర అవసరాలకు సరిపోదు. ఇప్పుడు మనం మార్కెట్లో 20 రూపాయలు పెట్టి కొంటున్న చాలా బాటిల్స్ నీటిలో టీడీఎస్ 20 నుంచి 30 కంటే ఎక్కువ ఉండదు.

అంటే మనల్ని నిలువునా మోసం చేయడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా హరిస్తున్నారు. ఇక 500 కంటే ఎక్కువ టీడీఎస్ ఉంటే ఆ నీరును హార్డ్ వాటర్ గా పరిగణిస్తాం. అది కూడా తాగేందుకు పనికిరాదు. టీడీఎస్ 100 నుంచి 500 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ నీరు మన శరీరానికి సరిపోతుంది. అసలు RO ఫిల్టర్ కేవలం హార్డ్ వాటర్ ను ఫ్యూరిపై చేసి అందులోని సాల్ట్స్ ను తొలిగించేందుకు మాత్రమే పనికొస్తుంది. మీ నీటిలో 500 కు పైబడి టీడీఎస్ ఉన్నప్పుడు మాత్రమే RO ప్యూరిఫైర్ ను ఉపయోగించాలి. అంత అధిక టీడీఎస్ ఉన్న నీటిని తాగకపోతేనే మంచిది. సో మీకు RO అవసరమే లేదు.

మార్కెట్ గిమ్మిక్కులకు పడిపోకుండా వేలకు వేలు పెట్టి RO లు, సోకాల్డ్ బ్రాండ్ మినరల్ వాటర్ బాటిల్ లు కొనకండి. మీ వాటర్ టీడీఎస్ తెలుసుకోండి. తాగేందుకు అనువైన నీరు అయితే బాగా మరిగించి చల్చార్చి తాగండి. దానికి కూడా మీకు సమయం లేకపోతే UV బేస్డ్ ఫిల్టర్ లు వస్తున్నాయి. అవి అన్ని రకాల వైరస్‌లను, బ్యాక్టీరియాలను సమర్ధవంతగా చంపుతాయి. అయితే వాటిలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఛాంబర్ ఉన్న UV ఫిల్టర్‌ లనే ఎంచుకొండి. వాటర్ పరిశుద్ధంగా ఉంటే సరిపోదు అందులో తగిన మినరల్స్ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి. టీడీఎస్ మీటర్ ద్వారా ముందు ఆ విషయం తెలుసుకోండి.

ఇది కూడా చదవండి: హరీష్‌రావుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement