Friday, April 19, 2024

హరీష్‌రావుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం

మంత్రి హరీష్‌రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ మెప్పు పొందేందుకు హ‌రీష్ రావు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొంద‌రు నేత‌ల‌కు డ‌బ్బులు, దావ‌త్‌లు ఇస్తున్నార‌న్నారు. కానీ భ‌విష్య‌త్‌లో హ‌రీష్‌కు కూడా తన గ‌తే ప‌డుతుంద‌ని ఈటెల హెచ్చ‌రించారు.

డబ్బు, ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందని ఈటెల స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు తమ పార్టీలో గెలిచానని పదే పదే అన్నందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని ఈటెల తెలిపారు. తమతో తిరిగే యువకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఈటెల ఆరోపించారు. అందరినీ బెదిరించి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలే కానీ చుట్టంగా కాదని హితవు పలికారు.

ఈ వార్త కూడా చదవండి: ఎల్లుండి ఇడుపులపాయలో ఏం జరగబోతోంది?

Advertisement

తాజా వార్తలు

Advertisement