Sunday, May 5, 2024

Cold wave: తెలంగాణలో పెరిగిన చలి.. గజగజ వణికిపోతున్న ప్రజలు

తెలంగాణలో చలి మళ్లీ విజృంభిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో చలి దారుణంగా పెరిగింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 8 నుంచి 9 డిగ్రీలకు తగ్గడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉత్తర తెలంగాణలో శీతల గాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి) గ్రామంలో అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో వీకెండ్‌లోనూ చలి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది ఊహించిన దాని కంటే కనీసం మూడు డిగ్రీలు తక్కువగా ఉంది. హయత్‌నగర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement