Thursday, April 25, 2024

భారత్‌ చెస్‌ మెంటార్‌గా ఆనంద్‌..

ఆసియా గేమ్స్‌ 2022లో పాల్గొనే భారతజట్టుకు చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ (ఎఐసీఎఫ్‌) ఆధర్యంలో భారత చెస్‌ ఆటగాళ్లు ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఏఎసీఎఫ్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ ఆసియా గేమ్స్‌లో భారత ఆటగాళ్లు స్వర్ణపతకాల సాధనే లక్ష్యంగా ఆడనున్నారు. విశనాథన్‌ ఆనంద్‌ మెంటార్‌గా బాధ్యతలు అప్పగించామని ఆయన తెలిపారు.

గురువారం భారత చెస్‌ ప్లేయర్స్‌తో ఆనంద్‌ భేటీ అవనున్నారని వెల్లడించారు. పురుషుల జట్టులో 10మంది, మహిళల జట్టులో 10మంది ఆటగాళ్లను ఎంపికచేయనున్నామని ఆయన పేర్కొన్నారు. వీరిలో ఐదుమంది మాత్రమే ఎంపికవుతారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితాను సెలక్షన్‌ కమిటీ ప్రకటిస్తుంది. సెలక్షన్‌ కమిటీలో అభిజిత్‌కుంటే, దిబేయాందు బారువా, దినేశ్‌శర్మ సభ్యులుగా ఉన్నారు. కాగా ఆసియాగేమ్స్‌లో సెప్టెంబర్‌ 11నుంచి చెస్‌ ఈవెంట్స్‌ ప్రారంభంకానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement