Monday, April 29, 2024

న‌టుడు స‌త్య‌దేవ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

మిమ్మ‌ల్ని చూసే న‌టుడిగా మారాన‌ని తెలిపారు న‌టుడు స‌త్య‌దేవ్. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది” అని స‌త్యదేవ్ ట్వీట్ చేశారు.దీనిపై స్పందించిన చిరంజీవి.. ”డియర్ సత్య‌దేవ్ కృత‌జ్ఞ‌త‌లు. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం. ఆచార్య‌లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. గాడ్ ఫాద‌ర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement