Wednesday, April 17, 2024

స‌ల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ‘చిరంజీవి’కి ఆతిథ్యం

మెగాస్టార్ చిరంజీవి కోసం త‌న ఫామ్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వ‌నున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. ముంబైలో షూటింగ్ జరిగే వారం రోజులు సల్మాన్ ఫామ్ హౌస్ లోనే సల్మాన్ బస చేయనున్నాడు. సల్మాన్ ఫామ్ హౌస్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆయనకు అత్యంత ఆత్మీయులు మాత్రమే అక్కడ విడిది చేస్తారు.మ‌ల‌యాళ ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి పోషిస్తుండగా… పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషిస్తున్నాడు. చిరంజీవితో సల్మాన్ ఖాన్ కు ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. దీంతో, ఈ సినిమాలో నటించాలని అడిగిన వెంటనే రెండో ఆలోచన లేకుండా సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచి ఈ చిత్రంపై అమితమైన ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ను ముంబైలో షూట్ చేయబోతున్నారు. ఎన్డీ స్టూడియోస్ లో షూటింగ్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి. వారం రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగబోతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement