Thursday, April 25, 2024

Maharashtra: బర్రెదూడపై అత్యాచారం.. చితకబాది పోలీసులకు అప్పజెప్పిన స్థానికులు

మహారాష్ట్రలోని పూణె సిటీలో దారుణం జరిగింది. బర్రెదూడపై అత్యాచారం చేసిన 38 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఘటన శుక్రవారం సిటీలోని దక్కన్ ప్రాంతంలో జరిగింది. ఆ వ్యక్తి బర్రెదూడపై అత్యాచారం చేస్తుంటే స్థానికులు గుర్తించి అతన్ని చితకబాదారు. వారి దెబ్బలు తాళలేక అతను అపస్మారక స్థితికి వెళ్లాడని అధికారి తెలిపారు.

నేపాల్‌కు చెందిన నిందితుడిని ప్రాణాపాయ స్థితిలో ఉండగా సాసూన్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు అందించిన సాక్ష్యాల ఆధారంగా.. ఐపీసీ 377 (అసహజ సెక్స్), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని ఇతర నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు దక్కన్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement