Saturday, April 27, 2024

జూన్ 1 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్!

దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ సత్ఫలితాలనిస్తోంది.  సెకండ్ వేవ్ తీవ్ర ప్రతాపం చూపిస్తున్న మహారాష్ట్రలో జూన్ 1 లాక్ డౌన్ వరకు పొడిగించింది మహా ప్రభుత్వం. కరోనా వ్యాప్తితో వైరస్ కట్టడి కోసం మరిన్ని వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. 

మరోవైపు కరోనా కేసుల తీవత్ర తగ్గకపోవడంతో లాక్ డౌన్ పొడిగింపుతో పాటు మరిన్ని కఠిన ఆంక్షలు కూడా విధించింది. అయితే, రవాణా మార్గం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ కొంతమేర సఫలీృతమైంది. కేసుల సంఖ్య నియంత్రణలో ఉన్నాయి. దాంతో మరో 15 రోజులు అంటే జూన్ 1 వరకూ లాక్‌ డౌన్ పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయాలంటే మరో పదిహేను రోజుల పాటు లాక్‌డౌన్ అవసరమని దాదాపు మంత్రులంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా కోవిడ్ నిబంధనల్ని పాటించాలని ముఖ్యమంత్రి ద్ధవ్ ఠాక్రే సూచించారు. భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, ముఖాలకు మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలన్నారు.

మరోవైపు వ్యాక్సిన్ కొరత కారణంగా 18-44 ఏళ్లలోపు వయస్సున్నవారికి కరోనా వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. మహారాష్ట్రలోని కొన్ని కేంద్రాల్లోనే 18-44 ఏళ్ల వయస్సున్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నామని..వ్యాక్సిన్ కొరత, సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేబినెట్ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement