Wednesday, May 15, 2024

మహాభారతంలో భీముడి.. నటుడు ప్రవీణ్ కన్నుమూత

సినీ ఇండ్రస్టీలో మరో విషాదం చోటు చేసుకుంది. గాన కోకిల లతా మంగేష్కర్ మృతి మరవక ముందే.. మరో ప్రముఖ నటుడు కన్నుమూశారు. బుల్లి తెర వీక్షకులను ఎంతగానో అలరించిన మహాభారత్‌ సీరియల్‌ లో భీముడిపాత్రను పోషించిన ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తి కన్నుమూశారు. నిన్న రాత్రి గుండె పోటుతో ఆయన మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. బీఆర్‌ చోప్రా రూపొందించిన మహాభారత్‌ సీరియల్‌ తో భీముడి పాత్ర.. ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తీసుకువచ్చింది. తన తండ్రి సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో మృతి చెందినట్లు ప్రవీణ్‌ కుమార్‌ కుమార్తె నికునిక తెలిపింది.

ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ కేవలం బుల్లి తెర నటుడిగానే కాకుండా అమితాబ్‌ షెహన్‌ షా, ధర్మేంద్ర లోహాతో పాటు ఆజ్‌ కా అర్జున్‌, అజూబా, ఘాయల్‌ తదితర చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. నటుడిగా మారక ముందు ప్రవీణ్‌ కుమార్‌ డిస్క్‌ త్రో క్రీడాకారుడిగా ఆయన రాణించారు. నాలుగు సార్లు ఏషియన్‌ గేమ్స్‌ లో మెడల్స్‌ సాధించారు. భారత్ తరఫున 1968, 1972 లలో ఒలింపిక్స్‌ గేమ్స్‌ లోనూ పాల్గొన్నారు. క్రీడాకారుడిగా అర్జున అవార్డును కూడా అందుకున్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో డిప్యూటీ కమాండెంట్‌గా కూడా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement