Monday, May 6, 2024

LPG Price Hike: వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధర

గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మార్చి నెల తొలిరోజే గ్యాస్ సిలిండర్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ (19 కేజీల)​ ధరను రూ. 105 మేర పెంచాయి. కొత్త రేట్లు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2012కు చేరింది.  అయితే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీలు) ధర మాత్రం మార్చి నెలకు గాను నిలకడగానే ఉంది. ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి పెంపు లేకపోవడంతో సామాన్యులకు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. కాగా, ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement