Monday, May 6, 2024

TS | దేశానికి కీర్తి తెచ్చిన ఒలింపిక్​ చాంపియన్​లకు సపోర్టుగా నిలుద్దాం: కేటీఆర్‌

రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ చీఫ్ బ్ర‌జ్‌భూష‌ణ్‌పై వ‌చ్చిన లైంగిక దాడి ఆరోప‌ణ‌ల‌పై నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. వారికి న్యాయం జ‌రిగేదాకా వారికి స‌పోర్ట్‌గా నిల‌బ‌డాల‌ని క్రీడాకారులు, యువ‌తీ, యువ‌కుల‌కు పిలుపునిచ్చారు. ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి ఓ ట్వీట్‌లో మంత్రి కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డిచేస్తూ.. ‘‘ఈ ఒలింపిక్ ఛాంపియన్‌లు మన దేశానికి కీర్తిని తీసుకొచ్చినప్పుడు మనం సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు వారితో పాటు నిలబడి మన సంఘీభావాన్ని తెలియజేద్దాం”అంటూ ట్వీట్​ చేశౄరు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని, అంతదాకా వారికి తెలంగాణ సపోర్టుగా నిలుస్తుందని, తన మద్దతు ఉంటుందని మంత్రి కేటీఆర్​ తెలిపారు.

ఇది కూడా చదవండి : Shame | రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ బ్రిజ్​భూషణ్​పై లైంగిక వేధింపుల కేసు నమోదు.. సుప్రీం ఆదేశాలు​

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement