Monday, April 29, 2024

చీమ‌ల‌పాడు బాధితుల‌కు కేటీఆర్ ప‌రామ‌ర్శ

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను పరామర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు సూచించారు.


అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చీమలపాడు ఘటన దురదృష్టకరమని చెప్పారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement