Monday, May 6, 2024

Karnataka: రేప్​ కేసులో లింగాయత్​ మఠాధిపతి అరెస్టు.. విచారణ నిమిత్తం పోలీసు కస్టడీలోకి

మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటకకు చెందిన లింగాయత్ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు పోలీసు కస్టడీలో ఉన్నారు. కాగా, ఇవ్వాల (ఆదివారం) అతడిని విచారణ నిమిత్తం మఠానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. పోలీసులు అతడిని నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో మురుగ మఠానికి అదనపు పోలీసు రక్షణ కల్పించారు. మురుగ శరణారావు శివమూర్తిని డీవైఎస్పీ అనిల్‌కుమార్‌ నేరస్థలానికి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయనున్నారు. అక్కడే పలు అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది.

అయితే.. శివమూర్తి మురుగ శరణారావును శుక్రవారం నుంచి నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై చిత్రదుర్గలోని మురుగ మఠానికి చెందిన ప్రధాన పీఠాధిపతిని మొన్నటి గురువారం అరెస్టు చేశారు.

కేసు ఏమిటంటే..

మైనర్లకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులో లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుపై కేసు నమోదైంది. ఇద్దరు మైనర్ల తరపున ఫిర్యాదు చేయడంతో మైసూరు సిటీ పోలీసులు శివమూర్తి మురుగ శరణారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతనిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

మఠం నిర్వహిస్తున్న పాఠశాలలో చదువుతున్న 15, 16 ఏళ్ల ఇద్దరు బాలికలు మూడున్నరేళ్లుగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు జులై 24న హాస్టల్‌ను విడిచిపెట్టి, జులై 25న కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో దొరికారు. ఆగస్టు 26న మైసూరులోని నజర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో లియాంగత్ మఠాధిపతిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement